Monday, 7 June 2021

బింబిసార: అన్న కోసం ఎన్టీఆర్ స్టెప్.. నందమూరి ఫ్యాన్స్ కేకలు పెట్టే అప్‌డేట్!

ఈ మధ్యకాలంలో ఓ హీరో సినిమాలో మరో హీరో భాగం అవుతుండటం చూస్తూనే ఉన్నాం. మల్టీస్టారర్ సినిమా కాకపోయినా స్టార్ హీరోల భాగస్వామ్యం అనేది ఆయా సినిమాలకు ప్లస్ అవుతోంది. ఈ నేపథ్యంలో అన్న కోసం రంగంలోకి దిగుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్లలో నందమూరి ఫ్యాన్స్ కేకలు పెట్టేలా ఎన్టీఆర్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు. మరోవైపు వెండితెరపై కళ్యాణ్ రామ్ తన లక్ పరీక్షించుకుంటున్నా చెప్పుకోదగిన హిట్ మాత్రం పడటం లేదు. ఈ నేపథ్యంలో అన్న సినిమాకు ప్లస్ అయ్యేలా ఎన్టీఆర్ ఓ స్టెప్ తీసుకుంటున్నారట. ఇటీవలే ప్రకటించిన '' మూవీలో ఎన్టీఆర్ కూడా భాగస్వామి కాబోతున్నారట. ఎలా అయినా సరే.. ప్రేక్షకులను మెప్పించే సినిమా చేయాలని మరింత పట్టుదలగా 'బింబిసార' అనే సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌తో పాటు చిన్న వీడియో కూడా విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. 'బాహుబలి'ని పోలి ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంతలో ఈ మూవీలో ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుండటం నందమూరి అభిమానులను మరింత హుషారెత్తిస్తోంది. వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. మరోవైపు ఎన్టీఆర్ సైతం ఎంత బిజీగా ఉన్నా అన్న కోసం రెడీ అన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T7nXKU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...