సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రహీలందరితో ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది ఈ బ్యూటీ. 2003 సంవత్సరంలో 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి, ఆ తర్వాత కొన్నేళ్లపాటు వెండితెరపై హవా నడిపించింది. గ్లామరస్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని పెళ్లి తర్వాత కాస్త హవా తగ్గించి తిరిగి ఈ మధ్య మళ్ళీ బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ప్రియమణి తన పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించిన విషయాలు వెల్లడించింది. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రియమణి ఆయనతో కొంతకాలం హాయిగా గడిపి ఇప్పుడు బుల్లితెర, వెండితెర అవకాశాలతో బిజీ బిజీ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ అమ్మడు.. కథ డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్, గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అంటోంది. కాగా పెళ్లి తర్వాత తన లైఫ్ హ్యాపీగా సాగిపోతోందని చెప్పిన ఆమె, తన భర్త మంచి సపోర్టింగ్ పర్సన్ అని, అలాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే సినిమాలు చేయగలుగుతున్నానని, తనకు లక్కీ చార్మ్ తన భర్తనే అని తెలిపింది. ఇక తమ మధ్య కూడా అందరు భార్యాభర్తల్లాగే చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని, కాకపోతే ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారని పేర్కొంటూ పర్సనల్ సీక్రెట్స్ బయట పెట్టేసింది ప్రియమణి. ప్రస్తుతం ఆమె వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమా, రానా హీరోగా రాబోతున్న 'విరాట పర్వం' సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రాబోతున్న ‘మైదాన్’ సినిమాలో భాగమవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pQ5vCM
v
No comments:
Post a Comment