Sunday, 13 June 2021

అలాంటివి గుట్టుగా చేసుకుంటూ పోయే వ్యక్తి ఆయన.. అన్నయ్య ఎప్పటికీ చిరంజీవే.. కోన వెంకట్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో ఎలా అయితే పెద్ద దిక్కుగా అన్ని వ్యవహారాలు చేసుకుంటున్నారో.. సేవాగుణం లోనూ రారాజుగా కీర్తించ బడుతున్నారు మెగాస్టార్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటూ తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ పోతున్నారు . దీంతో చిరు సేవలపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ '' పేరుతో ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు సంగీత దర్శకుడు, గాయకుడు చరణ్‌ అర్జున్‌. ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సినీ రచయిత, నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సాయం విలువ పొందిన వాడికే తెలుస్తుంది. నేత్రదానం, రక్తదానం, కష్ట కాలంలో ఆహారం దానం, నేడు ప్రాణవాయువు దానం, మరెన్నో గుప్తదానాలు గుట్టుగా చేసుకుంటూ పోతున్న అన్నయ్య ఎప్పటికీ చిరంజీవే. ఈ అద్భుతమైన పాట చేసిన అందరికి నమస్కరిస్తున్నాను'' అంటూ ఈ స్పెషల్ సాంగ్‌ని అందరి ముందుకు తీసుకొచ్చారు కోన వెంకట్. దీంతో ఈ పాట క్షణాల్లో వైరల్ అయింది. ''ఎవరన్నారు నువ్వు చిరంజీవని.. ఇప్పుడు నువ్వే మా సంజీవని'' అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో సాగిపోతున్న ఈ పాటను చరణ్‌ అర్జున్‌, నాగదుర్గ ఆలపించారు. చిరంజీవి తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ళను వివరిస్తూ ఈ సాంగ్ షూట్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి సేవలను కొనియాడుతున్న ఈ సాంగ్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇకపోతే సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. టాలీవుడ్‌కి సంబంధించిన పలు వ్యవహారాల్లో భాగం పంచుకుంటూనే ప్రస్తుతం 'ఆచార్య' మూవీ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమాన లోకం ఆతృతగా ఎదురు చూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iHOKbx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...