Friday, 25 June 2021

కూల్ లుక్‌లో డార్లింగ్.. ప్రభాస్ పిక్స్ వైరల్

సినిమాల కోసం, అప్డేట్ల కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తుంటారో అందరికీ తెలిసిందే. ఇక కనీసం ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించినా సరే అని సర్దుకుపోతుంటారు. అలా ప్రభాస్ ఫోటోలు నెట్టింట్లో కనిపిస్తే చాలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ హల్చల్ చేస్తున్నారు. ప్రభాస్ లేటెస్ట్ ఫోటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతోన్నారు. ప్రభాస్ చివరగా మీడియా ముందుకు వచ్చింది ఎప్పుడంటే జాతి రత్నాలు సినిమా ప్రమోషన్ కోసమే. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జాతి రత్నాలు టీం ముంబైకి వెళ్లడం అక్కడ ప్రభాస్‌తో కాసేపు చిట్ చాట్ చేయడంతో ప్రభాస్ కనిపించారు. ఇక ఏక్ మినీ కథ కోసం ప్రభాస్ ఓ పోస్ట్ పెట్టేశారు. అలా ప్రభాస్ ఎప్పుడూ కూడా మీడియాకు, కాంట్రవర్సీకి దూరంగా ఉంటారు. అలాంటి ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ కూల్‌గా నవ్వుతూ దర్శనమిచ్చారు. ఇక ప్రభాస్ వరుసబెట్టి సినిమా షూటింగ్‌లతో బిజీ కానున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. మిగిలిన కొంత భాగాన్ని వీలైనంత త్వరగా షూట్ చేసేస్తారని టాక్. ఆ తరువాత సలార్, ఆది పురుష్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొదటగా సినిమాను పూర్తి చేసే పనిలో ప్రభాస్ పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wYsPB4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...