Friday, 25 June 2021

Anchor Vishnupriya : రోజంతా చేస్తూనే ఉండగలదట.. యాంకర్ విష్ణుప్రియ మామూల్ది కాదు!

యాంకర్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా విష్ణుప్రియ అంటే అందరికీ డ్యాన్సులే గుర్తుకు వస్తాయి. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే వీడియోలు సెగలు పుట్టిస్తుంటాయి. మెలికలు తిరుగుతూ తన నడుము అందాలతో నెటిజన్లకు వల వేస్తుంటారు. ఈ మధ్యన జీరో సైజ్‌లోకి మారేందుకు విష్ణుప్రియ తెగ ప్రయత్నాలు చేశారు. అయితే విష్ణుప్రియ ప్రస్తుతం నాజుకు లుక్కులోకి మారారు. అద్దం ముందు నిలబడి ఆమె చేసే విన్యాసాలు వైరల్ అవుతుంటాయి. నడుమును తిప్పుతూ బొడ్డును చూపిస్తూ వేసే స్టెప్పులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అలా విష్ణుప్రియకు డ్యాన్స్ అంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అయితే డ్యాన్సులపై తనకు చిన్నతనం నుంచి మక్కువ ఉందని చెబుతూ నాటి విషయాలను గుర్తుకు చేసుకున్నారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు వేసిన ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్, నాటి ఫోటోను షేర్ చేస్తూ తన గురించి విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. ఇది 2009లో నా స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా దిగాను. ఆ సమయంలో నా పర్ఫామెన్స్‌లోని ప్రతీ బిట్‌ను ఎంజాయ్ చేశాను. రెండు నెలలకు పైగా క్లాసుల మధ్య టైం దొరికితే ప్రాక్టీస్ చేశాను. అది ఎంతో సరదాగా ఉండేది.. అయినా పదేళ్ల తరువాత కూడా అదే నా ప్రొఫెషన్ అవుతుందని అనుకోలేదు.. రోజంతా కూడా నేను డ్యాన్స్ చేస్తూనే ఉండగలను. నేను ఎంతో లక్కీ కదా? అంటూ తన గురించి విష్ణుప్రియ చెప్పుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2StIWI4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...