Friday, 25 June 2021

సితార రైమ్స్ టైమ్.. అప్పటి వీడియో పోస్ట్ చేసిన నమ్రత! మహేష్ డాటర్‌పై నెటిజన్స్ కామెంట్స్

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు కుమార్తె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్‌కి ఎంత మంది అభిమానులు ఉన్నారో.. సితారకు అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ భార్య .. సితార చిన్ననాటి నుంచి ప్రతీ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అంతేకాక సితార కూడా కొంతకాలంలో నుంచి ఓ యూట్యూబ్ ఛానల్‌ని నడుపుతూ అభిమానులకు తనదైన స్టైల్‌లో వినోదాన్ని పంచుతోంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యాతో కలిసి సితార తన యూట్యూబ్ ఛానెల్‌లో విభిన్నమైన వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరికి తెలుగు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ వచ్చింది. లక్షల సంఖ్యలో వీరి ఛానెల్‌కి సబ్స్‌స్క్రైబర్స్ వచ్చారు. తాజాగా నమ్రత ఓ కొత్త పనిని ప్రారంభించింది. సితారకు సంబంధించిన చిన్ననాటి విషయాలను ఆమె ప్రతీ రోజు ఒకటి పంచుకుంటుంది. ma కొద్ది రోజుల క్రితం ‘అప్పుడు-ఇప్పుడు’ అంటూ సితార చిన్ననాటి, ఇప్పటి పిక్స్‌తో కూడిన వీడియోని ఆమె షేర్ చేసింది. తాజాగా నర్సరీలో ఉన్న సమయంలో ‘5 ఎన్ 5 ఎగ్స్’ అంటూ చదువుతున్న వీడియోని ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. సితార ఎంతో క్యూట్‌గా రైమ్స్ పాడింది అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U0Tlvl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...