Saturday, 12 June 2021

స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ కిడ్ హల్చల్.. ప్రతి రోజు మ్యాజిక్ అంటూ హాట్ వీడియో వదిలిన బ్యూటీ!

సారా అలీ ఖాన్.. తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొన సాగిస్తూ హిందీ సినిమాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 'కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది సారా. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సారా.. తన అందాల హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మధ్యకాలంలో ‘నమస్తే దర్శకో’ అంటూ వార్త రిపోర్టర్ స్టైల్‌లో ఆ పర్యటన వీడియోలను పోస్ట్ చేసింది . ఇక రీసెంట్‌గా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దొరికిన ఖాళీ సమయంలో మాల్దీవులకు షికారుకు వెళ్లింది ఈ బ్యూటీ. అయితే సెకండ్ వేవ్ కారణంగా భారత్ అల్లకల్లోలం అవుతుంటే మీరు విహారా యాత్రలకు వెళ్తారా? అంటూ సారాపై పలువురు విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ సోషల్‌మీడియాలో సందడి చేయడం సారా ఏ మాత్రం తగ్గించలేదు. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ అందుకు సంబంధించిన వీడియోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియో విశేషం ఏమిటంటే.. ఆకాశం గులాబీ రంగులో కనిపించడం.. దీనికి సారా ‘మ్యాజిక్ ప్రతీ రోజు జరుగుతుంది’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xknC6n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...