Saturday, 12 June 2021

నల్లంచు తెల్లచీర.. మరోసారి రంగంలోకి మెగా రైటర్! యండమూరి దర్శకత్వంలో న్యూ మూవీ

కథా రచయితగా అందరికీ సుపరిచితం . రైటర్ గానే కాకుండా దర్శకుడిగా సినీ, సాహిత్య ప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. పలు సినిమాల విజయాల్లో భాగం పంచుకున్నారు. దర్శకుడిగా ''స్టువర్టుపురం పోలీస్‌ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు'' సినిమాలు రూపొందించిన ఆయన ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగుతున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో '' అనే మూవీ రూపొందనుంది. ఊర్వ‌శి ఓటీటీ స‌మ‌ర్ప‌ణ‌లో సంధ్య స్టూడియోస్ – భీమ‌వ‌రం టాకీస్ ప‌తాకాల‌పై ర‌వి క‌న‌గాల‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయికిశోర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. యండమూరి దర్శకత్వం వహించబోతున్న నాలుగో సినిమా ఇది. యండమూరి శైలిలో వినూత్నమైన కథ, కథనాలతో తెరకెక్కబోతున్న ఈ ‘నల్లంచు తెల్లచీర’ ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల కాబోతోంది. గతంలో యండ‌మూరి రాసిన ప‌లు న‌వ‌ల‌ల ఆధారంగా ''అభిలాష‌, ఛాలెంజ్, మ‌ర‌ణ మృదంగం, రాక్ష‌సుడు'' పేర్ల‌తో సినిమాలు రూపొంది గొప్ప విజయం సాధించాయి. ఈ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌‌ని మలుపుతిప్పాయి. యండమూరి కలం నుంచి జాలువారిన ఓ నవల 'దొంగ మొగుడు' పేరుతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది అసాధారణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు యండమూరి సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x8DMjo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...