చిన్నతనంలో చేసే అల్లరి, ఆడిన ఆటలను ప్రతీ ఒక్కరం మిస్ అవుతూ ఉంటాము. ఏ సందర్భంలో అయిన మరోసారి ఆ ఆటలు ఆడే అవకాశం వస్తే అస్సలు వదులుకోము. వయస్సును పక్కన పెట్టి మరీ ఆ ఆటలో పాల్గొంటాము. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఈ విషయాన్ని మరోసారి హీరోయిన్ అనన్య నాగల్లా రుజువు చేసింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వెండితెర దర్శకుల దృష్టిని ఆకర్షించింది . ప్రియదర్శి హీరోగా.. పద్మశ్రీ చింతకింది .. బయోపిక్‌గా రూపొందించి ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. అనన్య నటనకు మాత్రం మంచి మార్కులే వచ్చాయి. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన 'వకీల్‌సాబ్' సినిమాలో కీలక పాత్రలో నటించిన అనన్య.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ప్రాజెక్టులు వరుస కడుతున్నాయి. తాజా 'మల్లేశం' సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అనన్య. గచ్చకాయలు ఆట ఆడుతూ.. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ‘పద్మ’ క్యారెక్టర్‌లోకి వెళ్లేందుకు ఇది తాను ఫాలో అయిన ప్రాసెస్ అని ఆమె పేర్కొంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పల్లెలకు వెళ్లి అక్కడి వాళ్ల ఆటలు, ప్రవర్తన, భాష, యాస ఎలా ఉంటుందో తెలుసుకున్నాను అని తెలిపింది. తను ఆన్‌స్క్రీన్‌లో చేసే పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పింది అనన్య. అందరినీ అలరించడానికి తాను ఎంత దూరం అయిన వెళ్తానని స్పష్టం చేసింది. తనపై నమ్మకం ఉంచి పద్మ వంటి పాత్రను తనకు ఇచ్చిన మేకర్స్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gxTiyn
v
No comments:
Post a Comment