Tuesday, 1 June 2021

రాజమౌళి ఓ బలాదూర్..! రహస్యాలు బయటపెడుతూ ఓపెన్ అయిన విజయేంద్ర ప్రసాద్

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకొని ప్రేక్షకుల చేత దర్శక ధీరుడిగా పిలిపించుకుంటున్నారు రాజమౌళి. సినిమాల్లో కొత్తదనం, ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఎన్నో హిట్ సినిమాలు రూపొందించారు జక్కన్న. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని ఎల్లలు దాటించిన ఘనత ఆయనదే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. లేట్ అయినా సరే సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని ప్రేక్షకులు నమ్మేలా తనదైన ముద్ర వేసుకున్నారాయన. అలాంటి రాజమౌళి ఒకానొక సమయంలో బలాదూర్ అంటే నమ్ముతారా? కానీ ఆ విషయం ఆయన తండ్రే స్వయంగా చెప్పాక నమ్మకపోతే ఎలా..! ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన రాజమౌళి తండ్రి, ఫేమస్ రైటర్ చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. అందరిలాగే రాజమౌళి జీవితంలోనూ చాలా ఒడిదొడుకులు ఉన్నాయని, ఒకానొక సమయంలో కెరీర్ నిలబెట్టుకునేందుకు ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. ఉన్నత కుటుంబమే అయినా ఓ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట. ఇక యుక్త వయసులో అయితే చాలా మంది అబ్బాయిల లానే ఏ పని లేకుండా బలాదూర్‌గా తిరిగేవారట జక్కన్న. రాజమౌళిని గ్రాడ్యుయేషన్ చదివిద్దామనుకున్న తనకు ఆ సమయంలో ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉండటంతో చేర్పించలేక పోయానని, అయితే రాజమౌళి బలాదూర్‌గా తిరగడం చూసి మందలించానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆ సమయంలో డైరెక్షన్‌పై ఉన్న ఇంట్రెస్ట్ రాజమౌళి బయటపెట్టడంతో మొదట ఎడిటింగ్ నేర్పించానని, తర్వాత స్టోరీ రైటింగ్ గురించి కూడా గైడెన్స్ ఇచ్చానని అన్నారు. మొదట రాజమౌళి టాలెంట్‌ను కె.రాఘవేంద్రరావు గుర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు తన కొడుకు ఈ స్థాయికి ఎదగడం పట్ల చాలా సంతోషంగా ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vFjGg5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...