Tuesday, 1 June 2021

హీరో అజిత్ ఇంట్లో బాంబు కలకలం.. పోలీసులకు ఫోన్ కాల్ చేసి అలా చెప్పడంతో!

తమిళ స్టార్ హీరో ఉందంటూ పోలీసులకు సమాచారం రావడం షాకింగ్ పరిణామంగా మారింది. ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే అలర్ట్ అయింది పోలీసు యంత్రాంగం. మంగ‌ళ‌వారం ఉద‌యం చెన్నై కంట్రోల్‌ రూముకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో స్థానిక పోలీసులు హుటాహుటిన అజిత్‌ ఇంటికెళ్ళి తనిఖీలు చేశారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడి పరిసరాలను అణువణువునా గాలించారు. అజిత్ ఇంటి పరిసరాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని అని, ఉత్తుత్తి బెదిరింపేనని తేల్చేశారు. దీంతో సినీ వర్గాలతో పాటు, అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఎవరిపని అనేదానిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపడుతున్నారు. గతంలో కూడా ఇలా అజిత్ ఇంట్లో బాంబు ఉందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనతో పాటు స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్ ఇళ్లలో కూడా బాంబులు పెట్టామంటూ కాల్స్ చేశారు. ఇలా వరుసగా తమిళ స్టార్ హీరో ఇళ్లకే బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండటం జనాల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్ర‌స్తుతం ‘వాలిమై’ అనే సినిమాలో న‌టిస్తున్నారు అజిత్. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wT26FX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...