Wednesday, 23 June 2021

Akhanda: ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాకే హైలైట్.. నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్

మాస్ ఫాన్స్ పుష్కలంగా ఉన్న హీరో . కమర్షియల్ ఎలిమెంట్స్‌తో థియేటర్స్‌లో ప్రేక్షకుల చేత ఈలలు వేయించగల సమర్థుడు బోయపాటి శీను. వీళ్లిద్దరు కలిస్తే ఎలా ఉంటుందనేది ఇదివరకే ప్రూవ్ అయింది. ''సింహా, లెజెండ్'' సినిమాలతో నందమూరి అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు ఈ ఇద్దరూ. అదే జోష్‌లో ఇప్పుడు '' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి అభిమానులు కోరుకునే ప్రతిఒక్క అంశం ఉండేలా ప్లాన్ చేశారట. మరీ ముఖ్యంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారట బోయపాటి. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావలసి ఉండగా.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో సెట్స్ మీదకు రాబోతున్నారట. జులై మొదటివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడే బాలకృష్ణ, ఇతర నటీనటులతో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారట. దసరాకు ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ తీసుకొచ్చింది. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని సమాచారం. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vRlfXA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...