Tuesday, 22 June 2021

ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే అప్‌డేట్.. 'సలార్' 2 పార్ట్స్.. బాహుబలిని మించి ప్రశాంత్ నీల్ ప్లాన్!

'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయిన వరుసపెట్టి బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న ఆయన.. రీసెంట్‌గా '' సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ సినిమా రూపొందుతోంది. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పుడే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ కాగా.. ఇటీవలి కాలంలో బయటకొస్తున్న అప్‌డేట్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. భారీ రేంజ్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న 'సలార్' సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. 'బాహుబలి' సిరీస్‌ని మించేలా ఈ సినిమా ఉండాలని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది తొలి భాగం రిలీజ్ డేట్ అని, అతి త్వరలో రెండో భాగానికి సంబంధించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారనే టాక్ ముదిరింది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్న డైరెక్టర్ కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ పరిస్థితుల నడుమ 'సలార్' మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో పాటు మరో భారీ సినిమా 'ఆదిపురుష్' చేస్తున్నారు ప్రభాస్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d4GS0g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...