Tuesday, 25 May 2021

Rao Ramesh: 'మహా సముద్రం'లో గూని బాబ్జీ.. శర్వానంద్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లోకెల్లా ప్రత్యేకం రావు రమేష్. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్ చూపిస్తూ వైవిద్యభరితమైన రోల్స్ చేయడంలో ఆయన దిట్ట. రావు గోపాల్ రావు తనయుడిగా ఇండస్ట్రీలో ఆయన మార్క్ కనిపిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం '' మూవీలో నటిస్తున్నారు. అయితే నేడు (మే 25) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరోగా ‘Rx 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీ రూపొందుతోంది. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. అను ఇమ్మానుయేల్, అదితి రావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో రావు రమేష్ గూని బాబ్జీగా డిఫరెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో రావు రమేష్ టక్ చేసుకొని కోపంగా చూస్తున్నట్లు కనిపించారు. ఈ లుక్ చూస్తుంటే రావు రమేష్ మరోసారి ఓ ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు డిఫరెంట్ యాంగిల్‌లో కనిపించబోతున్నారని టాక్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34hNhQI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...