Tuesday, 25 May 2021

బాలయ్య బాబుతో కలిసి తాగుతా.. ఆయన బ్రాండ్ అదీ.. నా బ్రాండ్ బ్లాక్ డాగ్: శుభలేఖ సుధాకర్

నందమూరి బాలకృష్ణకి కాస్త కోపం ఎక్కువ.. ఆయనకి తిక్క రేగిందంటే అభిమాని అని కూడా చూడరు తాట తీస్తారనేది అనేక సందర్భాల్లో తేటతెల్లం అయ్యింది. అదే సందర్భంలో ఆయన మనసు వెన్న.. చిన్న పిల్లాడి మనస్తత్వం.. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం ఆయనకు చేతకాదు.. రీల్ లైఫ్‌లో నటించినట్టుగా రియల్ లైఫ్‌లో ఆయన నటించరు.. రియలిస్టిక్‌గానే ఉండే మంచి మనసు మా బాలయ్య సొంతం అని ఆయనతో పనిచేసిన చాలా మంది చెప్తూ ఉంటారు. ఇకపోతే ఇండస్ట్రీ ఎవరూ తాగరు.. అందరూ సుద్దపూసలే అన్నట్టుగా బాలయ్య బాబు బ్రాండ్‌తో సహా ట్రోల్ చేస్తుంటారు. నిజానికి తాను తాగుతానని నా బ్రాండ్ ఏంటో అందరికీ తెలుసు అంటూ డైరెక్ట్‌గానే చెప్పారు బాలయ్య. అయితే బాలయ్య బాబుతో కలిసి మందు కొట్టానని.. వారి బ్రాండ్‌లతో సహా చెప్తూ బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు సీనియర్ నటుడు . ఆయన మాట్లాడుతూ.. బాలయ్య బాబు చాలా లవ్ లీ పర్సన్.. ఆయన మనసు చిన్న పిల్లాడి మనసు. రీల్ లైఫ్‌లో ఒకలా.. రియల్ లైఫ్‌లో ఒకలా అని ఉండరు. మనకి బాలయ్య ఎలా కనిపిస్తారో అదే నిజం. పైకి ఒకలా లోపల ఒకలా ఉండరు. ఆయనకి చాలా మెమొరీ పవర్ ఎక్కువ. ఎన్టీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. పూజలు ఎక్కువగా చేస్తుంటారు. నాతో బాగా మాట్లాడుతుంటారు. టచ్‌లోనే ఉన్నారు. ఎస్పీ బాలు హెల్త్ ఇష్యూలో ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేవారు. అందరి విషయంలో బాలయ్య బాబు చాలా కేరింగ్‌గా ఉంటారు. హీరోలతో కూర్చుని సిట్టింగ్ వేసిన సందర్భాల గురించి చెప్పాలంటే.. బాలయ్య బాబుతో సిట్టింగ్ వేసేవాడ్ని. ఆయన బ్రాండ్ మాన్షన్ హౌస్ బ్రాంది. నేను వీస్కీ తాగుతా.. బ్రాండ్ బ్లాక్ లేబుల్. మేం మందు కొట్టే సందర్భంలో కూడా బాలయ్య బాబు చాలా వరకూ తన నాన్న గారి గురించి చెప్తారు.. పద్యాలపై ఆయనకి చాలా పట్టుఉంది. మంచి నటుడే కాదు మహా జ్ఞాని బాలయ్య. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది’ అంటూ బాలయ్య గురించి అద్భుతంగా మాట్లాడారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34e9y23
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...