Tuesday, 18 May 2021

Chiranjeevi: పావలా శ్యామలకు చిరు సాయం.. ప్రతి నెల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేసిన మెగాస్టార్

టాలీవుడ్‌లో నటీనటులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆపద్బాంధవుడిలా సాయం అందిస్తున్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా మారిన ఆయన, నటీనటులు ఎలాంటి ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవలే మరణించిన నటుడు, జర్నలిస్ట్ TNR కుటుంబానికి తనవంతు సాయం చేసిన మెగాస్టార్.. తాజాగా నటి పావలా శ్యామలకు అండగా నిలుస్తూ ఆర్ధిక సాయం చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ క‌ష్ట‌కాలంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకున్న చిరంజీవి.. ఆమెకు 1,01,500 రూపాయలతో 'మా' సభ్యత్వం ఇప్పించి, ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. నిర్మాత కొండేటి సురేష్‌, నటి కళ్యాణి ఇవాళ (మంగళవారం) సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి 'మా' సభ్యత్వం కోసం చిరంజీవి ఇచ్చిన రూ. 1,01,500 చెక్‌ను చూపించారు. 'మా' సభ్యత్వం తీసుకున్న ఆర్టిస్ట్ ఎవ‌రైనా అకాల‌ మ‌ర‌ణం చెందితే వారికి 3 ల‌క్ష‌ల రూపాయలు అందుతాయి. గతంలో కూడా చిరంజీవి గారు 2 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారని చెప్పుకొచ్చారు పావలా శ్యామల. ఎంతో క‌ష్టంలో ఉన్న ఆ సమయంలో రెండు లక్షల ఆర్థిక సాయం చాలా ఉపయోగపడిందని అన్నారు. ఇప్పుడు ఈ క‌ష్టంలో మ‌రోసారి సాయపడిన వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానని తెలుపుతూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు పావలా శ్యామల . తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే. కానీ, కొందరు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం దారుణం అని అన్నారు పావలా శ్యామల. ఎవరైనా సాయం చేయాలనిపిస్తే నేరుగా తన ఫోన్ నెంబర్ 9849175713కి సంప్రదించగలరు. సాయం చేయాలనుకున్న వారెవరైనా.. నేరుగా సంప్రదించి డబ్బులు అందించండి'' అని పావలా శ్యామల అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fwaeoH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...