Tuesday, 18 May 2021

Sonu Sood: వైద్యులకు సోనూ సూద్ సూటి ప్రశ్న.. తెలిసి కూడా అలా ఎందుకు చేస్తున్నారంటూ కామెంట్స్

కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న పేదలకు ఆపద్బాంధవుడయ్యారు . కోవిడ్ బాధితులకు పలు రకాలుగా సాయం అందేలా కృషి చేస్తున్నారు. ఆక్సిజన్, బెడ్స్, ఇంజెక్షన్స్ ఇలా ఎవ్వరికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను సంప్రదించండి అని పేర్కొంటూ తన సేవలను విస్తృతం చేస్తున్న సోనూ.. తాజాగా కోవిడ్ వైద్య బృందాలకు సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సాయం కావాలనుకున్న ప్రతి ఒక్కరి చూపు సోనూ సూద్ పైనే పడుతోంది. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల దాకా సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. చాలామంది కోవిడ్ ఇంజెక్షన్స్ దొరకక అలాడిపోతున్నారు. రీసెంట్‌గా వైజాగ్‌కి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఆమెకు కవాల్సిన ఇంజెక్షన్ దొరకడం లేదంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమే అయినా సోనూ సూద్ పెద్ద మనసు చేసుకుని దాన్ని బాదితుడికి అందజేశారు. అయితే ఇలాంటి బాధితుల సంఖ్య బాగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున సోనూకు అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనూ వైద్యులకు సూటి ప్రశ్న వేశారు. ఇంజెక్షన్ ఎక్కడా దొరకడం లేదని వైద్యులకు తెలిసినప్పుడు దాన్ని వైద్యులు ఎందుకు రికమండ్ చేస్తున్నారని ఆయన అడిగారు. ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమని తెలిసిన తర్వాత కూడా దానికి ప్రత్నామ్నాయాలను ఎందుకు చూడడం లేదో అర్థం కావడం లేదని సోనూ అన్నారు. సోనూ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడా దొరకని ఇంజెక్షన్లు సామాన్యులకు ఎక్కడ లభిస్తాయి. సోనూ వేసిన ఈ ప్రశ్న పరిగణలోకి తీసుకోవాల్సిందే అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/342n2gZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...