సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా విషాద వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా రక్కసి కారణంగా కొందరు సినీ నటులు కన్నుమూస్తుండగా అనారోగ్య కారణాలతో మరికొంత మంది సినిమా వాళ్ళు మరణిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శంకర్ తల్లి ముత్తులక్ష్మి (88) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయసు మీదపడటంతో అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు సమాచారం. శంకర్ తల్లి మరణ వార్త తెలియగానే తమిళ, తెలుగు సెలబ్రిటీలు పెద్దఎత్తున స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కుటుంబం లోని అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే ముత్తులక్ష్మి కన్నుమూయడంతో శంకర్ ఫ్యామిలీ అంతా విషాదంలో మునిగిపోయింది. బుధవారం ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' సినిమా చేస్తున్న శంకర్.. ఇటీవలే మరో రెండు ప్రాజెక్ట్స్ పనులతో బిజీ అయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న ఆయన, ఈ సినిమాను దాదాపు ఐదు భాషల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే 'అపరిచితుడు' సినిమాను హిందీలో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు శంకర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hyEiTh
v
No comments:
Post a Comment