Tuesday, 18 May 2021

ఎమర్జెన్సీ ఫుడ్‌.. ప్రపంచం నాశనం అయిపోయినా మనకు డోకా ఉండదు: పూరి జగన్నాథ్

‘పూరీ మ్యూజింగ్స్‌’ ద్వారా పలు విషయాలపై స్పందిస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తాజాగా ‘ఎమర్జెన్సీ ఫుడ్‌’ గురించి వివరణ ఇచ్చారు. అనుకోని విపత్తుల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఫుడ్‌ అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ''వరదలు రావొచ్చు.. యుద్ధాలు రావొచ్చు.. సునామీలో చిక్కుకుపోవచ్చు.. లేదా ప్రస్తుతం మనం చూస్తున్న ఇలాంటి విపత్తులాంటిది ఏదో ఒకటి వచ్చి లాక్‌డౌన్‌ పెట్టొచ్చు. ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్‌ పోవచ్చు. క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు వాహనం పాడైపోయి అడవి మధ్యలో మీరు ఇరుక్కుపోవచ్చు. అలాంటి సమయంలో మనం సర్వే కావడం కోసం ఎమర్జెన్సీ ఫుడ్ రెడీ చేశారు. ఒక డబ్బాలో ఫుడ్‌ ప్యాకెట్స్‌ ఉంటాయి. వండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక కప్పు వేడి నీళ్లు కలిపి ఆ ఆహరం తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌, లంఛ్‌, డిన్నర్‌ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్‌ ప్యాకెట్స్‌తో బకెట్స్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే రెండు రోజులకు సరిపడే ఫుడ్‌ ప్యాకెట్స్‌ కూడా దొరుకుతాయి. బార్లీ, కినోవా, ఓట్స్‌, న్యూడిల్స్‌, పాస్తా లాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ కనుక.. ఒక బకెట్‌ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పాతికేళ్లలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇందులో సూప్స్‌, చికెన్‌ నూడిల్స్‌, పాస్తా.. ఇలా ఏది కావాలంటే అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫుడ్ అందించే చాలా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని మిలిటరీ వాళ్ళు ఎక్కువగా వాడతారు. నా దగ్గర ఇలాంటి ఓ బకెట్ ఉంది. వీలైతే మీరు పైగా ఓ బకెట్ రెడీగా పెట్టుకోండి. ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్ రెడీగా ఉంటాయి'' అని పూరి చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bA20Lc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...