Tuesday, 18 May 2021

కూతురుతో సురేఖా వాణి తీన్మార్ స్టెప్పులు.. సారీలో పిచ్చెక్కించారులే..! వీడియో వైరల్

పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది . సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ని అమాంతం పెంచేసుకుంటూ ఆన్ లైన్ వేదికలపై రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితను కూడా సెలబ్రిటీ చేసేసింది సురేఖ. సినిమాలేవీ చేయకపోయినా సుప్రితను అనుసరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక ఈ తల్లీకూతుళ్ళ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. కూతురుతో కలిసి సురేఖా వాణి స్టెప్ వేసిందంటే ఆన్ లైన్ వేదికలు షేక్ కావాల్సిందే. ఇప్పటికే ఎన్నోసార్లు అలా సోషల్ మీడియాలో హంగామా చేశారు ఈ ఇద్దరూ. ఈ క్రమంలోనే తాజాగా మరో మాస్ డాన్స్‌తో ఇరగదీశారు. సురేఖతో పాటు ఆమె కూతురు సారీ కట్టి పిచ్చెక్కించే తీన్మార్ స్టెప్పులేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. తల్లీకూతుళ్ళ మాస్ డాన్స్, ఎనర్జీ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు. భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటోంది సురేఖా వాణి. మొన్నామధ్య ఈమె రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించింది సురేఖ. అలాగే సుప్రిత కూడా తన తల్లి రెండో పెళ్లి వార్తలపై కాస్త సీరియస్ అయింది. రీసెంట్‌గా తన 40వ పుట్టినరోజు జరుపుకున్న సురేఖా.. ఎప్పుడూ కూతురుతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటుంది. వీలుకుదిరినప్పుడల్లా ఆమెతో కలిసి షికార్లు కొడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో సుప్రిత సినీ ఎంట్రీ గురించి కూడా స్పందించిన ఆమె.. తన కూతురు ఇష్టంతో సినిమాల్లోకి వస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని కుండబద్దలు కొట్టేసింది. సో.. చూడాలి మరి సుప్రిత చేస్తున్న ఈ ఆన్ లైన్ హంగామా సిల్వర్ స్క్రీన్ హవాగా ఎప్పుడు మారుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eUxxcv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...