Tuesday, 18 May 2021

అలాంటి పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. అవతల ప్రాణాలు పోతున్నాయి.. రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్

దేశంలో విలయతాండవం చేస్తున్న కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సోనూ సూద్ సహా కొందరు సినీ ప్రముఖులు ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య కరోనా బాధితులకు తాను ఆసరాగా నిలుస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. ఎలాంటి వైద్య అవసరాలున్నా తనకు ఇన్స్‌స్టాలో మెసేజ్ చేయండి అని చెప్పిన రేణు.. తాజాగా నెటిజన్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కొంతమంది పెట్టే సరదా మెసేజీల కారణంగా సాయం అందక వేరొకరి ప్రాణాలు పోతున్నాయని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పంపించే హాయ్, హలో మెసేజీల కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. దాంతో నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలవడం లేదు. సరదా కోసం మీరు చేసే ఈ పనుల కారణంగా అవతల సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజీలు చేయడం ఆపండి అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం మాత్రం చేయడం లేదని చెప్పిన రేణు.. కోవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందులు, ఆక్సిజన్ విషయంలో చేతనైనంత సాయం చేస్తున్నా అని పేర్కొన్నారు. తన పేరుతో ట్విటర్‌లో ఉన్న ఖాతాని ఎవరూ ఫాలో కావొద్దని.. అది తనది కాదని ఆమె చెప్పారు. దయచేసి ఇకనైనా మారండి.. నాకు సరదా మెసేజీలు పెట్టొద్దు అని రేణు దేశాయ్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fvaKDp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...