Saturday, 15 May 2021

ఆ సీక్రెట్ ఏంటని హీరోలంతా అడుగుతుంటారు.. మహేష్ కాల్ చేసి అలా: సుధీర్ బాబు

యంగ్ హీరో సిక్స్ పాక్ బాడీతో ఆశ్చర్య పరుస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇటీవల నానితో కలిసి V మూవీ చేశారు. అందులో సుధీర్ బాబు ట్రాన్స్ఫర్మేషన్ చూసి అంతా షాకయ్యారు. ఫిజిక్ పెంచడంపై ఫోకస్ పెట్టిన ఆయన క్రమంగా సిక్స్ పాక్ బాడీ తెచ్చుకున్నారు. ఇటీవలే విడుదలైన ఆయన లేటెస్ట్ మూవీ '' ట్రైలర్ లోనూ అదే లుక్కుతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన సిక్స్ పాక్ బాడీ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు సుధీర్ బాబు. ఫిట్ నెస్ విషయంలో మొదటినుంచే శ్రద్ద పెట్టానని, యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలడు అనే ముద్ర నుంచి బయటపడటం కోసం, 'ప్రేమకథా చిత్రం' వంటి సినిమాలు చేశానని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి, సిక్స్ ప్యాక్ గురించిన విషయాలను మిగతా హీరోలు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారని ఆయన తెలిపారు. తాను చేసిన సినిమాలు నచ్చితే వెంటనే కాల్ చేసి అభినందిస్తారని, కృష్ణగారు మాత్రం చిన్న స్మైల్ ఇస్తారని అన్నారు. తన లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని సుధీర్ బాబు అన్నారు. ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్' తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ గింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rp2n42
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...