సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక అప్పుడప్పుడూ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నెట్టింట యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలు ఏ చిన్న తప్పు చేసినా ట్రోలింగ్ బారిన పడటం సాధారణం అయింది. ఈ క్రమంలోనే తమిళ నటి సౌందర్య నందకుమార్ ఓ దారుణమైన సంఘటన ఫేస్ చేసిందట. ఆ చేదు అనుభవం తాలూకు వివరాలను అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆవేదన చెందింది సదరు నటీమణి. తమిళ నటి సౌందర్య నందకుమార్‌ను ఓ లెక్చరర్ వేదించాడట. ఇన్స్‌స్టాగ్రామ్‌లో తాను లెక్చరర్ అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడారట. నాతో పడుకొంటావా? నీకు ఏమి కావాలంటే అది ఇస్తా. జస్ట్ నాతో పడుకోవాలి అంటూ మెసేజీలు పెట్టారట. దాంతో తనకు దిమ్మతిరిగిందని, ఆ సమయంలో ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని చెప్పింది సౌందర్య. అయితే తర్వాత అతన్ని గట్టిగా మందలించానని చెప్పిన ఆమె.. అతనిపై పోలీస్ కంప్లైట్ చేస్తానని, సమాజంలో గౌరవప్రదమైన ప్రొఫెషన్‌లో ఉండి ఇలా చేసే వారిని వదిలిపెట్టకూడదని చెబుతూ పోస్ట్ చేసింది సౌందర్య నందకుమార్. అతను చేసిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీశానని, అయితే ప్రస్తుతం తనను బ్లాక్ చేశాడని ఆమె తెలిపింది. ఆ లెక్చరర్ పనిచేసే కాలేజీలో కూడా ఈ విషయం చెబుతానని పేర్కొంటూ సౌందర్య నందకుమార్ ఆవేదన చెందింది. బాధ్యతాయుతమైన ప్రొఫెషన్‌లో ఉన్న వ్యక్తి ఓ మహిళతో ప్రవర్తించే తీరు అదేనా? అతను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొనేలా గట్టిగా బుద్ధి చెబుతానని ఆమె చెప్పింది. తమిళంలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ చేసిన ఇటీవల దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రంలో నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RcNq5l
v
No comments:
Post a Comment