Saturday, 15 May 2021

అనసూయ తొలి సాలరీ ఎంతంటే..? భయంతో ఛాన్సులన్నీ మిస్.. చివరకలా జర్నీ స్టార్ట్

సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్ట సుఖాలు అనేవి కామన్. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంటుంది. ఇలాగే యాంకర్ లైఫ్ లోనూ చాలా కష్టాలున్నాయట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె జీవితం తొలుత కష్టాలతోనే మొదలైందట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది అనసూయ. తాను ఎంబీఏ హెచ్‌ఆర్‌ చేసి ఓ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేశానని చెప్పిన అనసూయ.. అంతకంటే ముందు ఓ బ్యాంక్‌లో టెలీకాలర్‌గా కూడా పనిచేశానని తెలిపింది. తన మొదటి జీతం 5 వేల రూపాయలు అని చెప్పిన ఆమె.. హెచ్‌ఆర్‌గా చేస్తున్న సమయంలో తమ కంపెనీకి ఎంతోమంది దర్శకులు వస్తుండేవాళ్లని, కొన్ని సినిమాల్లో తనకు అవకాశాలు కూడా ఇచ్చేవాళ్లని తెలిపింది. అయితే తమ ఇంట్లో సినీ రంగం అంటే ఓ రకమైన భయం ఉండేదని, దాంతో వచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకున్నానని తెలిపింది. అదీకాక అప్పటికే తనకు నిశ్చితార్థమైపోయిందని.. అలా కొన్ని కారణాల వల్ల హెచ్‌ఆర్‌ జాబ్‌ మానేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత న్యూస్‌ రీడర్‌గా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రంగమ్మత్తగా యాక్టింగ్ టాలెంట్ టాలెంట్ బయటపెట్టిన ఆమెకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే 'పైన పటారం.. లోన లొటారం' అంటూ ఐటెం సాంగ్ చేసి హల్చల్ చేసిన ఈ భామ ప్రెజెంట్ అల్లు అర్జున్ 'పుష్ప', రవితేజ 'ఖిలాడి' సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో భాగమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ojVsoP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...