Saturday, 15 May 2021

నిన్ను బాగా మిస్ అవుతున్నాం.. యంగ్ హీరోపై ఛార్మి లవ్! ఆ రోజులు ఎప్పటికీ మరవలేమంటూ కామెంట్స్

ఒకానొక సమయంలో హీరోయిన్‌గా తెలుగు తెరపై అందాలు ఆరబోసిన ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న ఆమె ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ హీరో హీరోగా వచ్చిన ఈ సినిమాతో అటు పూరికి, ఇటు ఛార్మికి లాభాల పంట పండింది. అలా ఈ సినిమాతోనే టాలీవుడ్‌లో తిరిగి ఈ ఇద్దరి హవా మొదలైంది. ఈ నేపథ్యంలో నేడు (మే 15) హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఉద్దేశిస్తూ ఛార్మి కామెంట్స్ చేసింది. 'ఉస్తాద్... నిన్ను బాగా మిస్ అవుతున్నాం' అంటూ రామ్, పూరిలతో కలిసి దిగిన పిక్ షేర్ చేసింది. ''మన కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు ఎంతో సరదగా గడిపాం. లెట్స్ సెలబ్రేట్ సూపర్ సూన్'' అంటూ రామ్ పోతినేనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఛార్మి. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి రామ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఆయనకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇమేజ్ రెట్టింపయింది. మాస్ ఆడియన్స్ ఊగిపోయేలా వెండిటర్లపై మ్యాజిక్ చేశారు రామ్. అప్పటినుంచే ఆయన్ను RAPO (రామ్ పోతినేని) అని పిలవడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ తన 19వ సినిమాను లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీలో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మరోవైపు ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా 'లైగర్' మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oliADn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...