Monday, 10 May 2021

విజయ్ దేవరకొండ సూపర్ స్టారా?.. కొంప ముంచిన రష్మిక బర్త్ డే విషెస్!

హీరోల అభిమానులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. తమ హీరోలను ఎవ్వరు ఏమన్నా కూడా తట్టుకోలేరు. వారి పేర్ల ముందు వాడే స్టార్ ట్యాగ్‌ను వేరే వాళ్లకు వాడినా, ఇచ్చినా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలా వేసిన ట్వీట్ రచ్చకు దారి తీస్తోంది. నిన్న బర్త్ డే. ఈ క్రమంలో రష్మిక స్పెషల్‌గా విషెస్ తెలిపింది. అయితే కాస్త ఆలస్యంగానే ట్వీట్ వేసినా కూడా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె వేసిన ట్వీట్ నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా జంటకు సోషల్ మీడియాలో ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీత గోవిందం సినిమాతో ఈ జోడికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఆతరువాత డియర్ కామ్రేడ్ అంటూ సౌత్ మొత్తానికి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ మూవీ ఆశించినంతంగా ఆడలేదు. అయినా కూడా ఈజోడికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఓ యాడ్ కోసం మళ్లీ ఈ ఇద్దరూ ఒక్కచోటకు వచ్చారు. సంతూర్ సోప్ ప్రకటన కోసం రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. ఇక ఈ ప్రకటన విడుదల అవ్వలేదు. కానీ గత నెలలో రష్మిక మందన్నా తన ఫాలోవర్లతో లైవ్‌లో ముచ్చట్లు పెట్టిన సమయంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మళ్లీ విజయ్ దేవరకొండతో సినిమా ఎప్పుడు అని పదే పదే అడిగేశారు అభిమానులు. ఆ విషయం అతడినే అడగండి అని రష్మిక తప్పించుకున్నారు. విజయ్ బర్త్ డే (మే 9) సందర్భంగా నిన్న రష్మిక వేసిన ట్వీట్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సారీ నేను లేట్‌గా విష్ చేస్తున్నాను.. హ్యాపియెస్ట్ బర్త్ డే సూపర్ స్టార్.. నువ్ ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ అంతా బాగానే ఉన్నా కూడా సూపర్ స్టార్ అని వాడటంతోనే అసలు సమస్య మొదలైంది. విజయ్ దేవరకొండ సూపర్ స్టారా? అలా అని ఎవరు చెప్పారు.. విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయితే ఏంటి?.. ఇక సంగతి ఏంటి? అని ఇలా నెటిజన్లు పలు రకాలుగా రష్మికను ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. అసలే సూపర్ స్టార్ అంటే మన తెలుగు వరకు కేవలం మహేష్ బాబుకే సొంతం. కానీ ఇలా విజయ్ దేవరకొండకు ఆ ట్యాగ్ ఇవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ రష్మికను ఏకిపారేస్తున్నారు. మొత్తానికి ఈ రచ్చ అటూ ఇటూ తిరిగి విజయ్ దేవరకొండ మెడకు బిగిసేలా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o2SCEE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...