Monday, 10 May 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: విజయ్‌కి కొత్త పేరు.. ఆమె ఈషా ప్రపంచమట.. పాత ఫోటోలు షేర్ చేసిన కాజల్

ఆ పదానికి భాష అవసరం లేదు.. కీర్తీ ‘అమ్మ’ అనే పదానికి భాషతో సంబంధం లేదు అంటుంది ‘మహానటి’ . అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆమె తన తల్లికి విషెస్ చెబుతూ.. పోస్ట్ చేసింది. తన తల్లి ఫోటోలను పోస్ట్ చేసిన కీర్తీ.. ‘అమ్మ’ అనే పదం ఏ భాషలో అయినా ఒకే విధంగా వినిపిస్తుందని.. మదర్స్ డే విషెస్ చెప్పింది. విజయ్‌కి కొత్త పేరు పెట్టిన ఛార్మిరౌడీ స్టార్ ఆదివారం (మే 9న) తన 32వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు మిత్రులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. అయితే విజయ్‌కి విషెస్ చెప్పిన ఒకప్పటి హీరోయిన్ ఛార్మి.. తనకు ఓ కొత్త పేరు పెట్టింది. ‘బంగారం.. 26 క్యారెట్స్’ అంటూ విజయ్‌ని పిలుస్తూ ఆమె పోస్ట్ చేసింది. ఆమె నా ప్రపంచం.. ఈషా రెబ్బా ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ తల్లులకు విషెస్ చెబుతూ.. పోస్ట్ చేశారు. ఈషా రెబ్బ కూడా తన తల్లి ఫోటోలను పంచుకుంటూ.. ‘‘నా ప్రపంచం, నా హృదయం, నా సర్వస్వం’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘సూదంటి కళ్లే’ అంటూ శ్రీముఖి ఫన్నీ పోస్ట్ యాంకర్ శ్రీముఖి సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోషూట్‌లతో పాటు.. కొన్ని ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ.. ఫాలోవర్లను అలరిస్తోంది. తాజాగా వర్షం సినిమాలోని ‘ఝూలే ఝూలే’ అని పాటలోని ‘సూదంటి కళ్లే’ అనే లిరిక్స్ ఫన్నీగా రీల్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. చాలా రోజుల క్రితం ఇలా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ మధ్య ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్‌మీడియాలో మటుకు ఈ భామ చాలా యాక్టివ్ ఉంటుంది. తాజాగా తన పాత ఫోటోషూట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tCts0K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...