Wednesday, 12 May 2021

దగ్గుబాటి అభిరామ్‌కి షాక్ ఇచ్చిన ఉప్పెన బ్యూటీ.. శ్రీరెడ్డి ఇష్యూతో సైడ్ అవుతున్న హీరోయిన్లు!

తాత రామానాయుడు మూవీ మొగల్‌గా టాలీవుడ్‌ని ఏలిన రారాజు. సొంత బ్యానర్.. స్టుడియోలను నెలకొల్పడంతో పాటు నిర్మాతగా వందలాది చిత్రాలను నిర్మించి ఎంతోమంది నటీనటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక తండ్రి సురేష్ బాబు కూడా తాత బాటలోనే నిర్మాతగా బడా స్థాయిలోనే ఉన్నారు. ఇక అన్న రానా అంటారా.. హీరోగా రాణిస్తున్నాడు. బాబాయ్ వెంకటేష్ అయితే ఆయనకు ఇండస్ట్రీలో తిరుగే లేదు. ఏ సినిమా చేసినా అయితే హిట్లు లేదంటే మినిమిమ్ గ్యారంటీ ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంటారు. ఇలాంటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది వరం అనే చెప్పాలి. కానీ ఒక్క ఇష్యూ.. ఒకే ఒక్క ఇష్యూ.. ఆ కక్కుర్తి పని దగ్గుబాటి అభిరామ్‌ని ఇండస్ట్రీకి దూరం చేసింది. అటు నిర్మాతగా కాకుండా ఇటు హీరోగా కాకుండా చేసింది. వివాదాస్పద నటి శ్రీరెడ్డితో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కైపోవడంతో దగ్గుబాటి వారసుడు పరువు ఫిల్మ్ నగర్ ఛాంబర్ సాక్షిగా బట్ట బయలైంది. తనని వాడుకుని వదిలేశాడంటూ శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేస్తూ.. అభిరామ్ సాగించిన రాసలీలలు మొత్తాన్ని ఫొటోలతో సహా బయటపెట్టేసింది. అయితే గతం గతః అన్న రీతిలో దగ్గుబాటి వారసుడు లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అభిరామ్ హీరోగా ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. వీరి కాంబో ఫిక్స్ అయ్యింది. అయితే తన బర్త్ డే సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన అభిరామ్.. తన అప్ కమింగ్ మూవీ లవ్ స్టోరీ అని.. ఇందులో మంచి మెసేజ్ ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు.. తన కెరియర్‌లో బ్యాడ్ ఎక్స్ పీరియన్స్‌గా నిలిచి పోయిన శ్రీరెడ్డి ఇష్యూ కూడా ఇందులో ఉండబోతుందనే విషయాన్ని తెలియజేశారు అభిరామ్. కాగా ఈ చిత్రంలో అభిరామ్‌కి జోడీగా నటించేందుకు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించగా ఆమె ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిన అభిరామ్‌కి జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో దర్శకుడు తేజ.. తనదైన శైలిలో ఓ కొత్త హీరోయిన్‌ని తెరపైకి తీసుకువస్తున్నారట. అయితే కృతి శెట్టి కాకుండా మరో ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోయిన్లు కూడా అభిరామ్ సరసన నటించేందుకు ఒప్పుకోకపోవడంతో కొత్త హీరోయిన్స్‌తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారట దర్శకుడు. బ్యాగ్రౌండ్ బాగానే ఉన్నా అభిరామ్‌ ఇండస్ట్రీకి రాకముందే శ్రీరెడ్డి ఇష్యూతో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే ఇష్యూని తన సినిమాలో కూడా పెట్టడంతో ఎందుకొచ్చిన రిస్క్‌లే అనుకుని హీరోయిన్లు మెల్లగా సైడ్ అవుతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Bwacn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...