Wednesday, 12 May 2021

మీ సేవలు అనిర్వచనీయం.. మహేష్ బాబు ప్రశంసలు

సూపర్ స్టార్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతీసారి సమాజం గురించి పోస్ట్‌లు పెడుతుంటారు. ధరిత్రి దినోత్సం, మాతృ దినోత్సం ఇలా స్పెషల్ డేలకు మహేష్ బాబు ట్వీట్లు వేస్తుంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యేక దినోత్సవాలకు సంబంధించి పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. అయితే వైద్య సిబ్బంధి చేస్తున్న సేవలు మాత్రం అందరినీ కదిలిస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో నర్సులు పోషిస్తోన్న పాత్ర గురించి మహేష్ బాబు చెబుతూ ప్రశంసలు కురిపించారు. కరోనా లాంటి దారుణమైన పరిస్థితుల్లో ముందుండి సేవలందిస్తున్న వారందరికీ ఇది అంకితం.. మీరు చేస్తోన్న సేవలకు సాటి రాదు.. అనిర్వచనీయం.. మీ బలం, ఆదరణ, మీకున్న నిబద్దతకు థ్యాంక్స్. మీ వల్లే ఆశలు ఇంకా బతికి ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ మీ వెంట మేముంటాం.. మీకు సపోర్ట్‌గా నిలుస్తాం.. కరోనా సెకండ్ వేవ్ అనేది మనందరికీ ఓ సవాల్ వంటిది.. మనమంతా బాధ్యతగా ఉందాం.. మన రాష్ట్రాల్లోని లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను అని మహేష్ బాబు అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RN9Ae2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...