Sunday, 16 May 2021

రీమేక్‌ సినిమాతో ఎంట్రీకి రెడీ అయిన బెల్లంకొండ గణేశ్.. హీరోయన్‌గా ఉప్పెన బ్యూటీ..?

కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ మధ్య తమిళ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘రాట్ససన్’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసిన అతను ఆ తర్వాత రీమేక్‌ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం అతను బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. రాజమౌళీ, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో అతను హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో గ్రాండ్ హిట్ అందుకోవాలనే తపనతో.. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచినా ‘కర్ణన్’ సినిమాను అతను తెలుగులో రీమేక్ చేస్తున్నాడనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. అయితే శ్రీనివాస్ సోదరుడు.. గణేశ్ కూడా హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తాడని ప్రకటించి చాలా కాలమైంది. కానీ సరైన స్క్రిప్ట్ దొరకకపోవడంతో.. అతని ఎంట్రీ వాయిదాపడుతూ వస్తుంది. అయితే కర్ణన్ రీమేక్‌లో శ్రీనివాస్ నటించే అవకాశం లేకపోతే.. ఆ సినిమాను గణేశ్ చేస్తాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా గణేశ్ మరో సినిమా రీమేక్‌ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. 2006లో షాహిద్ కపూర్, అమృతరావు ప్రధాన పాత్రలో నటించిన ‘వివాహ్’ అనే సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టిని హీరోయిన్‌గా అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. తొలి సినిమాతోనే గణేశ్ మంచి సక్సెస్ అందుకొనే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uUj4mq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...