Sunday, 16 May 2021

అదే రూట్‌లోకి వెళ్తున్న ఆకాశ్ పూరీ.. వేరే ఛాన్స్ లేకపోవడంతో కీలక నిర్ణయం

ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు .. హీరోగా మాత్రం సక్సెస్ సాధించలేదు. ఇప్పటివరకూ అతను చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం అతను ‘’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ పడూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 18న విడుదల చేసిందుకు ప్లాన్ చేశారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు తెరిచి ఉన్న చోట్ల కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి సినిమాలు చూసేందుకు జనం భయపడుతున్నారు. దీంతో మేకర్స్ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ‘థాంక్యూ బ్రదర్’ వంటి సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆకాశ్ పూరీ కూడా ఇదే రూట్‌లో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన సినిమా ‘రొమాంటిక్‌’ను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని అతను భావిస్తున్నాడట. మేకర్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోందని గతంలోనే ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమోగానీ.. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని దీంతో.. ఆకాష్ రొమాన్స్ నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుందనే చర్చ సాగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oj3Hlg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...