Sunday, 16 May 2021

సాయం అందించేందుకు ముందుకు వచ్చిన మహేశ్ బాబు.. అక్కడవారి కోసం వ్యాక్సిన్ ఏర్పాటు

సెకండ్ వేవ్‌లో కరోనా దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా తాకిడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. సరైన వైద్యసౌకర్యాలు అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సహాయం అందించేందుకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కొందరు కరోనా బాధితుల సహాయం కోసం ఆర్థిక సహాయం అందిస్తుండగా.. మరికొందరు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గం హిందూపురంకి రూ.25 లక్షల విలువైన కరోనా కిట్లు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా బాధితులకు సహాయం అందించేందుకు సూపర్‌స్టార్ ముందుకు వచ్చారు. కోవిడ్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి సోషల్‌మీడియా వేదికగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తను దత్తతు తీసుకున్న గ్రామ ప్రజలకు ఆయన మరోసారి అండగా నిలిచారు. అక్కడివారికి వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మహేశ్ బాబు అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేశ్ బాబు ప్రస్తుతం ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. కీర్తీ సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్‌. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కనుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘ఎస్ఎస్ఎమ్‌బీ28’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bu9nDR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...