Wednesday, 12 May 2021

ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు చంద్ర శేఖర్ కన్నుమూత

సంగీత దర్శకుడు, రేడియో మాస్టర్ (72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం (మే 12) తుది శ్వాస విడిచారు. చంద్ర శేఖర్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్ర శేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. హార్మోనియం, కీ బోర్డ్ వంటి వాయిద్య కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర శేఖర్. సినీ సంగీత దర్శకులు రమేష్ నాయుడు, చక్రవర్తిల వద్ద సహాయకుడిగా పనిచేసిన ఆయన.. అల్లు రామలింగయ్య చిత్రం 'బంట్రోతు భార్య' తో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశం చేసి 100కు పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా వర్క్ చేశారు. హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేసి గీతఆర్ట్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన 'యమకింకరుడు' చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. భానుచందర్ 'హంతకుడి వేట', రాజేంద్ర ప్రసాద్ 'ఆణిముత్యం', కోడి రామకృష్ణ 'ఉదయం', 'అదిగో అల్లదిగో', దాసరి 'భోళాశంకరుడు', 'ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్& హిందీ ) ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. చివరకు విశాఖ ఆకాశవాణి కేంద్రంలో పదవీ విరమణ పొందారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hojz4m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...