Wednesday, 12 May 2021

హైద్రాబాద్‌కు రజినీ గుడ్ బై.. సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్!

సూపర్ స్టార్ ఇప్పుడు షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. గతంలో ఓ సారి హైద్రాబాద్‌లో షూటింగ్ చేసిన రజినీ ఆరోగ్యం బాగా లేకపోవడం, చిత్రయూనిట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ చాలా గ్యాప్ తరువాత షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. గత నెలలో రజినీ హైద్రాబాద్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు రజినీకాంత్ తిరిగి చెన్నైకి బయల్దేరారని తెలుస్తోంది. గతంలో షూటింగ్ జరిగిన లొకేషన్‌లో కరోనా కలకలం సృష్టించడంతో అన్నాత్తె యూనిట్ సభ్యులు కరోనా బారిన పడ్డారు. వారితో పాటు రజినీకాంత్‌కు దెబ్బతినడం.. దీంతో పరిస్థితి కాస్త విషమించడంతో హైద్రాబాద్‌లోనే చికిత్స తీసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అన్నాత్తె యూనిట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్‌ను ముగించినట్టున్నారు. కాగా నిన్నటితో రజనీకాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో ఆయన చెన్నైకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కూడా రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్‌లో అన్నాత్తే చిత్రం కోసం 35 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గోన్నారు. తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇక తాజాగా సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో ఆయన మంగళవారం చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే అన్నాత్తే షూటింగ్ పూర్తవుతుందట. కుష్బూ, మీనా వంటి సీనియర్ నటీమణులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uMta9e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...