Friday, 21 May 2021

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయకుడు జై శ్రీనివాస్ ఇకలేరు

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీ మీద ప్రతాపాన్ని చూపుతోంది. కరోనాకు ఎంతో మంది ప్రముఖులు బలి అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ కరోనా పెను విషాదాన్ని నింపుతోంది. వరుసగా సెలెబ్రిటీలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న నేరడికొమ్మ శ్రీనివాస్ () మరణించారు. కరోనాతో పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితమే కన్నుమూశారు. కరోనా సోకి ఆస్పత్రి పాలైన జై శ్రీనివాస్‌ ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎంతగానో ఎదురుచూశారు. అప్పటికే వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. దాదాపు 11 లక్షల వరకు ఖర్చు పెట్టిన జై శ్రీనివాస్.. ఆ తరువాత దాతల కోసం ఎదురుచూశారు. కానీ చివరకు కరోనా అతడి ప్రాణాలను తీసుకుంది. పరిస్థితి తీవ్ర తరం కావడంతో శ్రీనివాస్ కన్నుమూశారు. దేశభక్తి పాటలతో శ్రీనివాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. జై సినిమాలోని దేశం మనదే తేజం మనదే అనే పాటతో ఫేమస్ అయ్యారు. అలా అప్పటి నుంచి జై శ్రీనివాస్‌గా మారిపోయారు. రాజారాణి, వీధి ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు. కరోనా బాధపడుతున్న సమయంలో తెలుగు చిత్ర సీమ గాయనీగాయకులు అందరూ ముందుకు వచ్చారు. చేతనైన సాయం చేశారు. మంగ్లీ, మనీషా ఎర్రబత్తిని, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్, హారికా నారాయణ్ ఇలా ఎంతో మంది ముందుకు వచ్చారు. కానీ వారు చేసిన ప్రార్థనలు, అందించిన సాయం ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాయి. జై శ్రీనివాస్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఓ ప్రకటన చేసింది. ‘ప్రముఖ తెలంగాణ గాయకుడు శ్రీ జై శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. అయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు’ అని చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/342waSY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...