Friday, 21 May 2021

నిర్మాత బీఏ రాజు కన్నుమూత.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో (62) కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ‘సూపర్‌హిట్‌’ అనే సినీ పత్రికను నడిపిన ఆయన.. సుమారు 1500 చిత్రాలకు పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించారు. ఆయన భార్య బి. జయ దర్శకత్వంలో వచ్చిన.. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. అయితే రెండేళ్ల క్రితం డైరెక్టర్ బి. జయ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ క్రిష్ణ సినిమాలతో పాటు.. మహేష్ బాబు చిత్రాలకు పీఆర్వోగా పనిచేసిన బీఏ రాజు మరణంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఆయనతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oQ2YZb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...