Friday, 21 May 2021

Ek Mini Katha పై డార్లింగ్ పోస్ట్.. దర్శకుడి రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్

డార్లింగ్ తన దర్శకులతో ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తన కెరీర్‌లో మొదటి బిగ్గెస్ట్ సక్సెస్ అయిన వర్షం సినిమాను ఎప్పటికీ మరిచిపోలేరు. అలా ప్రభాస్ కెరీర్‌లో వర్షం ఓ మైలురాయిలా నిలిచింది. ఆ మూవీ దర్శకుడు శోభన్. అయితే ఆ దర్శకుడు మరణించినా కూడా ఆయన ఫ్యామిలీకి ప్రభాస్ అండగా ఉంటున్నారు. శోభన్ తనయుడు సంతోష్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంతోష్ హీరోగా రెండు సార్లు హిట్ కొట్టేందుకు ప్రయత్నించారు. తను నేను, పేపర్ బాయ్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో పేపర్ బాయ్ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. అయితే సంతోష్‌కు మాత్రం సరైన హిట్ పడలేదు. మళ్లీ ఇంత గ్యాప్ తరువాత ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. అంటూ విభిన్న కాన్సెప్ట్‌తో వచ్చేందుకు సిద్దమయ్యారు. మామూలుగా అయితే Ek Mini Katha మూవీని థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదని ఓటీటీకి మొగ్గు చూపారు. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే వారం(మే 27) విడుదల కానుంది. ఈ మేరకు వదిలిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఈ మూవీ మీద ఓ పోస్ట్ చేశారు. నా కెరీర్‌లో వర్షం అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. అలాంటి ఓ గొప్ప సినిమా ఇచ్చినందుకు శోభన్ గారికి థ్యాంక్స్. ఆయన తనయుడు సంతోష్ హీరోగా ఏక్ మినీ కథ అనే సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది’ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ytMt9p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...