Thursday, 20 May 2021

సైలెంట్‌గా అలా చేసేయండి.. దానిపై కాలేసుకుని పడుకుని మరీ ఛార్మీ రచ్చ

హీరోయిన్, నిర్మాత అయిన ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్నారు. లాక్డౌన్ కారణంగా తమ లైగర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పూరి జగన్నాథ్, ఛార్మీ గత ఏడాది నుంచి ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే అన్ని పరిస్థితులు చక్కబడ్డాయని అనుకుని, షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. కానీ అంతలోపే సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేసింది. దీంతో లైగర్ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. అలా పూరి జగన్నాథ్, ఛార్మీ ఇద్దరూ కూడా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడే తమ ఆఫీస్‌లో కాలాన్ని గడిపేస్తున్నారు. ఆ మధ్య ఓసారి ప్రభాస్ ముంబైకి వెళ్లిన సమయంలో ఛార్మీ, పూరిని కలిశారు. ఆ సందర్భంలో ఛార్మీ షేర్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. సింహం అంటూ తన పెట్, ప్రభాస్ ఫోటోలను షేర్ చేశారు. అందులో ఛార్మీ పెంపుడు కుక్క అందరినీ ఆశ్చర్యపరిచింది. అలస్కన్ మలమూటే అంటూ తన తొమ్మిది నెలల కొడుకు అంటూ అందరికీ పరిచయం చేసేశారు. ఛార్మీ అంత ఎత్తున్న ఆ కుక్కను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అలా తన పెట్‌తో దిగే ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో హల్చల్ అవుతుంటాయి. ఈ మధ్య ఛార్మీ తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ఛార్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పూరి భార్య వార్నింగ్ ఇచ్చిందని ఇలా ఏవేవో వార్తలు వచ్చాయి. వాటన్నింటికి సమాధానం ఛార్మీ ఓ పోస్ట్ చేసింది. పెళ్లి చేసుకుని తప్పు చేయనని తన అభిప్రాయాన్ని ఛార్మీ కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశారు. అలా ఛార్మీ పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. తాజాగా ఛార్మీ ఓ పోస్ట్ చేసింది. సైలెంట్‌గా ఉండండి.. మీ కుక్కను హగ్ చేసుకోండి.. అని అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. తన పెట్ మీద కాలేసుకుని సోఫా మీద పడుకున్న ఫోటోను ఛార్మీ షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fA3032
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...