Thursday, 20 May 2021

దుమ్ములేపిన ఫ్యామిలీమెన్ 2 ట్రైలర్.. ఇండియన్ ఓటీటీలో సరికొత్త రికార్డ్!

వెబ్ సిరీస్ చూడని సినీ ప్రేమికులెవ్వరూ ఉండరు. రెండేళ్ల క్రితం ఈ సిరీస్ దేశ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మేకర్స్ అయిన రాజ్ అండ్ డీకే, చిత్రయూనిట్ అందరూ ఖుషీ అయ్యారు. ఇక సెకండ్ సీజన్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్మించేందుకు రంగం సిద్దంచేశారు. ఈ క్రమంలోనే కోసం ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేశారు. అదే విధంగా బ్యాక్ డ్రాప్‌ను కూడా చెన్నైకి మార్చేశారు. అలా సౌత్ మొత్తాన్ని ఆకర్షించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సీజన్ 2 రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసేశారు. ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.. ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ మరింత క్వాలిటీగా సినిమాను అందించేందుకు వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి సీజన్ 2కి మోక్షం లభించింది. అలా వచ్చే నెలలో ఫ్యామిలీ మెన్ సీజన్ 2 విడుదల కాబోతోందని ప్రకటించారు. ఈ క్రమంలో వదిలిన ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. మొదటి సీజన్‌లో మనోజ్ తివారి, ప్రియమణి హైలెట్ అయితే.. ఈ సీజన్‌లో సమంత హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నారు. సమంత అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. డీ గ్లామర్ రోల్‌లో సమంత రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. అయితే ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో.. 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించింది. ఈ దెబ్బకు మీర్జాపూర్ 2 రెండో స్థానంలోకి పడిపోయింది. మొత్తానికి ఈ వెబ్ సిరీస్‌తో సమంత నేషనల్ వైడ్‌గా దుమ్ములేపేందుకు సిద్దమైనట్టున్నారు. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RCxER8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...