Thursday, 20 May 2021

'పెళ్లి సందడి' సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

మహమ్మారి కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నింపుతోంది. కోవిడ్ సోకి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు మృతి చెందగా.. నేటి (మే 21) తెల్లవారు జామున సీనియర్ మోస్ట్ కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు జయరాం. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hJilRA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...