Thursday, 20 May 2021

‘ఆయన నవ్వించారు.. ఈయన జాగ్రత్తలు చెప్పారు’.. అనిల్ రావిపూడి కామెంట్స్

రెండో దశలో వైరస్ ప్రారంభం చాలా తీవ్రంగా ఉంది. ఈసారి సామాన్యులతో పాటు వైరస్ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. చాలా మంది ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. అందులో చాలా మంది కోలుకోగా.. కొందరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అలా కరోనా వైరస్ సోకిన ప్రముఖులలో స్టార్ దర్శకుడు ఒకరు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకగా.. డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ మధ్యే వైరస్ నుంచి కోలుకున్న ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో దాని గురించి ఆలోచిస్తూ కూర్చొకుండా.. పుస్తకాలు చదువుతూ.. కొత్త స్క్రిప్టులు రాసుకుంటూ ఉండేవాడని ఆయన అన్నారు. అంతేకాక.. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో హీరో వరుణ్ తేజ్, వెంకటేశ్ కాల్ చేసేవాళ్లని చెప్పారు. వెంకటేశ్ బాబు తగిన జాగ్రత్తలు చెప్పగా.. వరుణ్ తేజ్ ధైర్యం చెప్పారని తెలిపాడు. ఇక రెండు, మూడు రోజులకి ఒకసారి మహేశ్ బాబు కాల్ చేసి.. తన సరదా మాటలతో నవ్వించేవారిని అన్నాడు. దాని వల్ల తాను ఒత్తిడిలోకి వెళ్లకుండా ఉండేవాడనని చెప్పాడు. మహేశ్ మాటలు తనకు మందులాగా పని చేశాయని స్పష్టం చేశాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అనిల్.. ఆ తర్వాత తన సూపర్‌హిట్ సినిమా ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ అనే సినిమని రూపొందిస్తున్నారు. దాదాపు సగం పూర్తయిన ఈ సినిమా షూటంగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత అనిల్ బాలకృష్ణతో, మరోసారి మహేశ్ బాబు, రవితేజాలతో సినిమా చేసే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3v5ocEy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...