Monday, 10 May 2021

ఆ విషయంలో పవన్‌కళ్యాణ్‌ని ఫాలో అవుతున్న పూజా హెగ్డే

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ఉండా ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు.. ఈ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక చాలా మంది సెలబ్రిటీలు కూడా అంటే ఇష్టపడతారు. ఆయన పాటించే విధానాలు, సింపుల్‌గా ఉండే వ్యక్తిత్వం తదితర కారణాలతో ఆయనకి ఫాన్స్ అవుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ పవన్‌కళ్యాణ్‌ని ఫాలో అవుతోందట. అయితే అది సోషల్‌మీడియాలోనో.. మరో విషయంలోనో కాదు.. మామిడి పళ్ల విషయంలో. ఎండాకాలం వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ తన తోటలో పండిన మామిడి పళ్లను కోసి బుట్టల్లో పెట్టి తన మిత్రులకు, దగ్గరి బంధువులకు పంపిస్తుంటారు. దానితో పాటు ఆయన వారికి ఓ సందేశం కూడా పంపిస్తుంటారు. అయితే ఈ విధానం పూజా హెగ్డేకి విపరీతంగా నచ్చిందట. దీంతో ఆమె కూడా తన తోటలో కాసే పండ్లను మిత్రులు, సన్నిహితులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళూరులో ఈ భామకి ఓ తోట ఉంది. అందులో కాసే పండ్లను టాలీవుడ్‌లోని ఆమె మిత్రులకు కూడా అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత హీరోయిన్లలో పూజా హెగ్డే టాప్‌లో ఉంది. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాలో భారీ సక్సెస్ అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న బుట్టబొమ్మ.. ఆ తర్వాత మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, దళపతి65 తదితర సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమాలో కూడా నటిస్తోంది పూజా. ఇక ఇటీవల ప్రకటించిన మహేశ్, త్రివిక్రమ్ సినిమాలోనూ పూజానే హీరోయిన్‌గా అనుకుంటున్నల్లు టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tAEvra
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...