Monday, 10 May 2021

బాల్యంలో ఆ ఘటన.. మాయని గాయం.. అసలు విషయం చెప్పిన సింగర్ సునీత

సింగర్ సునీత్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. అలా తన ఫాలోవర్లకు తన గాత్రంతో మంత్రం వేస్తున్నారు. కాసేపైనా బాధలు మరిచిపోయేలా చేస్తున్నందుకు సునీతకు అందరూ థ్యాంక్స్ చెబుతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ఎవరికి చేతనైన సాయం వారు చేయండని సునీత కోరారు. తనకు తెలిసింది పాటలు పాడటమే..అందుకే ఇలా తాను పాటలు పాడి కాసేపైనా అందరి బాధలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో గత మూడు రోజులుగా చెప్పిన టైంకు వచ్చిన సునీత.. తన అభిమానులు అడిగిన పాటలను పాడుతూ వచ్చారు. ప్రతీ రోజూ అర్ధగంట అంటూ రాత్రి ఎనిమిది గంటలకు లైవ్‌లోకి సునీత ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకాస్త టైం పెంచొచ్చు కదా? అని అభిమానులు సునీతను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే తన భర్త రామ్‌తో కలిసి లైవ్‌లోకి రండి అంటూ రిక్వెస్ట్‌లుపెడుతున్నారు. అయితే ఈ సందర్బంగా ఓనెటిజన్ ఆమె మొహాన్ని నిశితంగా గమనించారు. నుదురుకు ఏం జరిగిందంటూ అడిగేశారు. నుదురు మీద ఉన్న గాయం గురించి చెబుతూ సునీత తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకున్నారు. చిన్నతనంలోనే ఆ ప్రమాదం జరిగిందని, ఐదారు కుట్లు పడ్డాయని, ఆ తీపి గుర్తులు ఇంకా గుర్తున్నాయని సునీత అన్నారు. ఇక నేటి సునీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. నేటి రాత్రి కూడా లైవ్‌లోకి రాబోతోన్నట్టు సునీత తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33zQw5C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...