Monday, 10 May 2021

పెళ్లి, సినిమా అప్డేట్‌లపై ప్రశ్నలు.. అభిజిత్ చెప్పిన సమాధానాలివే!

బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్‌కు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి.. బయటకు వచ్చిన తరువాత తన అభిమానులతో అంతగా టచ్‌లో లేకుండా పోయారు. అభిజిత్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. సమయం సందర్భం ఉంటే తప్పా సోషల్ మీడియాలో కనిపించరు. అలాంటి అభిజిత్ తాజాగా లైవ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి, కరోనా విజృంభణ గురించి అభిజిత్ మాట్లాడారు. రోజుకు నాలుగు లక్షల కేసులు వస్తున్నాయంటే మాట్లాడటానికే చాలా బాధగా ఉంది. ప్రపంచంలో మన దేశమే దారుణమైన స్థానంలో ఉందంటూ అభిజిత్ అన్నారు. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడమే ముఖ్యమని అన్నారు. ఈ క్రమంలో తన ఫాలోవర్లతో మాట్లాడుతూ తన వంతు బాధ్యతగా చెప్పాల్సింది చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్లు,వైద్య సిబ్బంధి, పారిశుధ్ద కార్మికులకు అభిజిత్ ధన్యవాదాలు తెలిపారు. వారు చేస్తోన్న సేవలకు సలామ్ కొట్టేశారు. తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పడుకుంటాడో.. మళ్లీ ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదని అన్నారు. లైవ్‌లోకి వచ్చిన అభిజిత్‌ను సినిమా అప్డేట్ గురించి ప్రశ్నలు కురిపించారు. అఖిల్, సోహెల్, మెహబూబ్, దివి, అరియానా, హారిక ఇలా ఎంతో మంది తమ సినిమా అప్డేట్లను ప్రకటించారు. కానీ అభిజిత్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఓ మూడు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయని అప్పుడెప్పుడో చెప్పారు. కానీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త వాటిని నేర్చుకుంటున్నాని, ప్రస్తుతం అయితే స్పానిష్ నేర్చుకుంటున్నానని అభిజిత్ అన్నారు. అలాగే స్క్రిప్ట్‌లు వింటున్నానని, ఇప్పుడే ఏం చెప్పలేనని తెలిపారు. ఇక పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌కు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఇప్పుడప్పుడే ఉండదు లే అంటూ తప్పించేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o2dvjg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...