Monday, 10 May 2021

మహేశ్-అనిల్‌ సినిమాపై లేటెస్ట్ బజ్.. సినిమాలో సూపర్‌స్టార్ పాత్ర అదేనట..!

ఈ మధ్యకాలంలో కామెడీకి ప్రాధాన్యత ఇస్తూ.. మంచి కమర్షియల్ విలువలతో సినిమాలను తెరకెక్కించే దర్శకులలో ముందు వరుసలో ఉంటాడు. ‘పటాస్‌’ నుంచి ‘’ సినిమా వరకూ అనిల్ తీసిని సినిమాలు అన్ని సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తన సూపర్‌హిట్ సినిమా ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్‌లుగా తెరకెక్కిన ‘ఎఫ్‌2’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ‘ఎఫ్‌3’ పేరుతో మరింత ఫన్‌తో ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు అనిల్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా భయానక పరిస్థితులు నెలకొనడంతో వాయిదా పడింది. మరోవైపు అనిల్ కూడా కరోనా బారిన పడి ఈ మధ్యకాలంలోనే కోలుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేస్తారనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. అయితే తాను త్వరలో నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా, మహేశ్ బాబుతో మరో సినిమా.. ఆ తర్వాత మాస్ మహరాజ రవితేజాతో ‘రాజా ది గ్రేట్’ సినిమా సీక్వెల్‌ను చేస్తున్నట్లు తెలిపాడు. అయితే మహేశ్, అనిల్ కాంబోలో రూపొందే సినిమాపై ఇప్పటికే పుకార్లు మొదలయ్యాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు సినిమా జరుగుతున్న సమయంలోనే మరో సినిమా గురించి మహేశ్ బాబుతో చర్చ చేసినట్లు తెలిపాడు. కథ విన్న మహేశ్.. దానికి ఓకే చెప్పారని పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ సూపర్ హిట్ సినిమా ‘ఒక్కడు’ స్టైల్‌లో స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో క్రికెట్ కోచ్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y0b9Gl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...