Monday, 17 May 2021

ఆ ప్రశ్న అడగటంతో ఇబ్బంది పడ్డ హీరోయిన్.. చిన్నవయస్సులో తెలియక చేశానంటూ క్లారిటీ

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని ఇష్టపడని క్రికెట్ ప్రియులు ఉండరు అనడంలో అతిశయెక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా సచిన్‌కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్‌ని కెరీర్‌గా ఎంపిక చేసుకున్న వాళ్లు సచిన్‌నే ఆదర్శంగా పెట్టుకుంటారు. తన కెరీర్‌లో ఎన్నో అసాధ్యమైన ఘనతలు సాధించిన సచిన్.. రిటైర్ అయినప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అయితే బాలీవుడ్ నటి హూమా ఖురేషి మాత్రం సచిన్ పోస్టర్లు చించేసిందట. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ అనే సినిమాతో హుమా వెండితెరకి పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఆమె. వైట్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఊహించినంత సక్సెస్ లభించలేదు. తమళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే సోషల్‌మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌, హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్‌" అనే చాట్‌ షోలో హూమా పాల్గొంది. ఈ షోలో తన చిన్నతనంలో తన సోదరుడు సకీబ్ సలీంతో జరిగిన గొడవల గురించి తను చెప్పింది. తన సోదరుడితో గొడవ పడి తాను అతని అభిమాన క్రికెటర్ పోస్టర్లు చింపేశానని ఆమె పేర్కొంది. అయితే సచిన్ పోస్టర్లు చింపిన విషయంపై హోస్ట్‌లు ఆమె ప్రశ్నించినప్పుడు కాస్త ఇబ్బంది పడింది. సచిన్ తన అభిమాన క్రికెటర్‌ అని.. చిన్నతనంలో.. తెలియక ఆయన పోస్టర్లు చింపినట్లు ఆమె తెలిపింది. అంతేకాక.. తను సచిన్ పోస్టర్లు చింపినందుకు ప్రతీకారంగా సకీబ్ హుమా అభిమాన క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పోస్టర్లు చింపేశాడని వెల్లడించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fE2Bg7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...