Monday, 3 May 2021

అందరికీ అది తెలియకపోవచ్చు!.. అందుకే అనుష్క ‘స్వీటీ’ అయ్యారేమో

అసలు పేరు స్వీటీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. స్వీటీ అనే పేరుకు తగ్గట్టే అనుష్క మనసు కూడా ఎంతో తియ్యనిది. మాటలు, నడవడిక, కనిపించే తీరు, మాట్లాడే తీరు అన్నీ కూడా స్వీట్ గానే ఉంటాయి. అలాంటి అనుష్క ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ప్రజలందరిలోనూ ధైర్యాన్ని నింపేలా ఓ పోస్ట్ చేశారు. చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనాకు బలవుతున్నారు. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఈ తరుణంలో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. వాటిని తొలగించి ధైర్యం నింపేందుకు అనుష్క తన పద్దతిలో కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు ఈ కష్ట కాలంలో ప్రతీ ఒక్కరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను.. పోయిన వారిని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం.. ఇలాంటి దుర్భర స్థితిలోంచి బయటపడేందుకు మనమే ఒకరినొకరు సాయం చేసుకుంటూ పోవాలి..అందరూ ప్రభుత్వ నియమనిబంధనలు పాటించండి. ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి.. మీకు మీరే స్వీయ నిర్భంధాన్ని విధించుకోండి.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి.. వారితో సమయాన్ని గడుపుతూ ఉండండి.. ప్రతీ ఒక్కరికీ వారి బాధను ఎలా చెప్పుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు. అందరూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ప్రతీ రోజూ ఓ పాజిటివిటీతో మొదలుపెట్టండి.. దాని కోసం అన్వేషించండి.. జీవితంలో మనకు ఆ పాజిటివ్ ఎనర్జీయే అవసరం. మనకు చేతనైనంత సాయం చేయండి.. అది ప్రార్థనలు అయినా పర్లేదు.. మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం.. నెగెటివిటీ మీద దృష్టి పెట్టి మనకున్న శక్తిని వృథా చేసుకోవద్దు. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు’ అంటూ అనుష్క శెట్టి చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో అనుష్క శెట్టి ఇలా స్పందించడంపై అందరూ నిజమైన స్వీటీ అని కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vEClbD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...