Monday, 3 May 2021

Salaar: ప్రభాస్ కోసం రంగం లోకి మరో హీరోయిన్.. ఆమెతో స్పెషల్‌గా రెబల్ స్టార్.. డైరెక్టర్ స్కెచ్ ఇదే!

యంగ్ రెబల్ స్టార్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ''. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్న డైరెక్టర్ ఇక కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని రంగంలోకి దించుతున్నారట. ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన ఆయన నెక్స్ట్ షెడ్యూల్‌లో ఈ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మునుపెన్నడూ ఏ సినిమాలో చూడని రేంజ్‌లో ఉండేలా ఆ సాంగ్ చిత్రీకరించబోతున్నారని, ఇందులో ప్రభాస్, రొమాన్స్ ప్రేక్షకుల చేత గోల పెట్టిస్తుందనే టాక్ నడుస్తోంది. యాక్షన్ సినిమా అయినా ఈ సాంగ్‌తో కొన్ని నిమిషాల పాటు ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయి ఇలా స్కెచ్చేశారట. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ షూటింగ్ ఫినిష్ కాగా కరోనా కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే అతిత్వరలో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్న డైరెక్టర్.. ఈ స్పెషల్ సాంగ్ కంప్లీట్ చేయబోతున్నారని సమాచారం. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nINg1c
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...