Thursday, 20 May 2021

బాలీవుడ్‌లో మరో విషాదం.. కన్నతల్లిని కోల్పోయిన ప్రముఖ సింగర్ అర్జిత్

కారణంగా భారతదేశ వ్యాప్తంగా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడి మరణిస్తున్నారు. మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతీ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఓ వైపు కరోనా ప్రతీ ఒక్కరు కరోనా నిబంధనలు పటిష్టంగా పాటిస్తున్నా.. కేసుల పెరుగుదలలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్‌లో సినీ పరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా మంది ప్రముఖులు తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ .. కరోనా కారణంగా తన తల్లిని కోల్పోయారు. ‘ఆషికీ-2’ చిత్రంలో తుమ్‌ హీ హో, కబీరా, సునోనా సంగ్‌మర్‌మర్, మస్త్ మగన్, రాత్ భర్, సంజావన్ తదితర పాటలతో అర్జిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా పలు పాటలు పాడిన ఆయన.. ఇక్కడి ప్రేక్షకులకూ చేరువయ్యారు. గురువారం కోల్‌కత్తాలో ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆమె.. తీవ్ర శ్వాస ఇబ్బందులు, ఇతర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. అర్జిత్ సింగ్ తల్లి ఆస్పత్రిలో చేరిన విషయాన్ని స్వస్థికా ముఖర్జి వెల్లడించారు. కోల్‌కతాలోని ప్రముఖ ఆస్పత్రి ఎఎమ్ఆర్‌ఐలో అర్జిత్ తల్లి వైద్యం తీసుకుంటున్నారని చెప్పిన స్వస్థికా.. ఆమెకు ఏ నెగటివ్ రక్తం అవసరం ఉందని.. దయచేసి సహాయం చేయాలని కోరారు. ఆమెతో పాటు మరో దర్శకుడు శ్రీజీత్ ముఖర్జి కూడా అర్జిత్ తల్లికి సహాయం చేయాలని ట్విట్టర్‌లో కోరారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం మాత్రం లభించలేదు. అర్జిత్ తల్లి గురువారం ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oweHMd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...