Thursday, 20 May 2021

Jr Ntr అర్ధనగ్న ఫొటోతో శ్రీ రెడ్డి రచ్చ.. సో సెక్సీ అంటూ మనసులో మాట బయటపెట్టిన సంచలన తార

సోషల్ మీడియాలో టాప్ రేంజ్ పాపులారిటీ ఎవరిదయ్యా అంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీ రెడ్డి. నిత్యం పలు వివాదాలతో ఆన్ లైన్ వేదికలను వేడిక్కించడం అమ్మడి నైజం. తనపై ఎన్ని విమర్శలొచ్చినా, ఎవరేమనుకున్నా తన దారి తనదే అన్నట్లుగా వెళ్లే శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో అయితే కొందరు సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ బూతుపురాణం చదువుతోంది. టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలడం లేదు. అయితే యంగ్ టైగర్ విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుండటం విశేషం. గతంలో కూడా చాలాసార్లు ఎన్టీఆర్ విషయమై మాట్లాడిన శ్రీ రెడ్డి.. ఆయనపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుండటం గమనించవచ్చు. అందరు హీరోలపై విమర్శలు గుప్పించే ఆమె, ఒక్క ఎన్టీఆర్ విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తోంది. అభిమానులను తన కుటుంబంలా చూసుకునే ఒకే ఒక్క దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పిన శ్రీ రెడ్డి.. ఆడవారిని అమ్మా అని పిలిచే మీ సంస్కారానికి నా జీవితాంతం మీకు అభిమానిగా ఉంటాను సార్. ఇందుకే ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. జై ఎన్టీఆర్ అని గతంలో పోస్టులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన సిక్స్ ప్యాక్ ఫొటోను కూడా షేర్ చేస్తూ సెక్సీ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ''సెక్సీ, హ్యాండ్సమ్.. టాలీవుడ్‌ లైఫ్ టైమ్ బెస్ట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీపై, మీ కుటుంబంపై ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ మరోసారి తన అభిమానాన్ని బయటపెట్టింది. 'ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు కాని వస్తే మాత్రం పక్కా CM అవుతారు, ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు' అంటూ గతంలో నందమూరి ఫ్యాన్స్‌ని ఫిదా చేసే పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ లుక్‌పై ప్రశంసలు గుప్పించడం గమనార్హం. అదునుచూసి హీరోల బండారాలు బయటపెట్టే ఈ సంచలన తార ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇలా వ్యవహరిస్తుండటం జనాల్లో హాట్ ఇష్యూ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bGhZaq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...